కీలకమైన వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి ఎదురుదెబ్బ. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో షమిపై సెక్షన్ 498 ఏ కింద వరకట్న వేధింపులు, సెక్షన్ 354 ఏ కింద లైంగిక వేధింపుల కేసు కింద పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.ప్రపంచకప్, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. చార్జిషీట్‌లో షమితో పాటు అతని సోదరుడు హసిబ్ అహ్మద్ పేరును కూడా చేర్చారు. నాన్‌బెయిలబుల్ నేరాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోల్‌కతా మహిళా గ్రీవెన్ సెల్ పోలీసులు గురువారం అలీపోర్ ఏసీజేఎమ్ కోర్టులో దాఖలు చేశారు. దీంతో షమీ వరల్డ్‌కప్‌లో ఆడడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
#mohammedshami
#hasinjahan
#cricket
#indiavsaustralia
#kolkata
#iccworldcup2019
#ipl
#ipl2019
#australiainindia2019
#delhicapitals